సీలేరు గడ్డా పుష్పా అడ్డా!!!! మోతుగూడెం పరిసరాల్లో పుష్ప2
పదిరోజులపాటు సినిమా షూటింగ్ సందడి
కాకినాడ జనసేన ప్రతినిది మే 12: ఆ పక్కనాదే ఈ పక్కనాదే తలపైన ఆకాశం ముక్కనాదే హే బిడ్డా ఇదీ నా అడ్టా అంటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల హృదయాల్లో పుష్ప మొదటి పార్ట్ సినిమాతో యావత్ ప్రపంచానికే తన నటనా సత్తా చూపించి విజయడంఖా మ్రోగించారు. సంగీతం పాటలు డైలాగులు ప్రేక్షల హృదయాల్లొ నాటుకు పోయాయి.ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లొ ఎంత లోతుగా పాతుకుపోయిందంటే అల్లుఅర్జున్ లా రస్మికమందన్నా లా నటనా హవా భావాల తో నువ్వు అమ్మి అమ్మి అంటు నీపెళ్లానైపోయి నట్టుందిరా సామి బంగరుసామి మిసలసామి రొషలసామి, అంటు,కొందరు ఊ అంటావా మావా ఉఊ అంటావా అని పాటల స్టెప్పుల తో ఇంకోందరు ఇలశ అనేక మంది ఫ్యాన్స్ చిన్నారులు వృద్దులు ఇంక అనేక లక్షల మంది ఆనందంతో ఆ ఊహల్లో కెల్లి ఊహించుకుంటు ఎవరికి నచ్చిన తీరీలో వారు చిందులు వేసి ఆప్రాతలలొ జివించెసారు. సోషల్ మిడియాలొ అప్లొడ్ చేసారు తెగ ట్రోల్ అయ్యెవి .
మాస్ కే మాస్ ఊరమాస్ లా అల్లు అర్జున్ ఏంటీ ఈ గేటప్ ఏంట్రా బాబోయ్ అనేలా రిలిజ్ కి ముందు వచ్చిన టిజర్స్ పోస్టర్స్ చూసిన ప్రేక్షకులు ఇదేం సినిమా హిట్ అవుద్దా! పట్ అవుద్దా!! అని అన్నవారికి నీవెవ్వా తగ్గేదేలే!! అంటు బ్లాక్ బస్టర్ బద్దలైయ్యేలా సూపర్ డూపర్ హిట్ కొట్టారు.ఇంతటి ఘన విజయానికి కారకుడు ఎవరు!! ఇంకకెవరు లెక్కలు మాస్టార్!! అవును ఆ లెక్కల మాస్టారే సినిమాలో ప్రతి ప్రేమ్ ని లెక్కకు లెక్కకట్టి కూడికల్లో ఎక్కడ మైనేస్సులు లేకుండా అన్ని ప్లస్సు లే వచ్చేలా అందరి నటులను తనలెక్కల సూత్రాలు తీరిలొకి వచ్చే వరకు సానపెట్టి జీవించేలా ట్రైలర్స్ తొ సన్నివేశాలు షూట్ చేసి తను ఆషాట్ చూసి తృప్తి చెందితే తప్పా షాట్ ఓకే చేసేవారు కాదేమో అందుకేనేమో ప్రతి ప్రేమూ లెక్కకు తగ్గ దృశ్యాన్ని ప్రేక్షకుడి కళ్లముందు జివించేలా తెరకెక్కించటం ఈ మాస్టర్ నైజమేమో!!. నిర్మాత పెట్టిన ఖర్చుకి వడ్డికి బారు వడ్డిలతో సహ లెక్కలు అందని అంకెలు రాసులగా పోగై కోట్లాది రూపాయల లాభాల బాటలొ బంగారపు పుష్పలతో కాసుల వర్షం కురించేలా చేసారు. నుటికి నూరు మార్కులు వచ్చేలా స్టూడెంట్స్ కి కష్టపడి చదువు చెపితే వారంతా పస్ట్ క్లాస్ లో పాస్ అయితే మాస్టర్ కష్టపడిన భాదకంటే ఆ రిజల్ట్ వచ్చిన ఆరోజు అసందర్భంలో ఆ మాస్టర్ కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదు కధ!! అదే ఫార్ముల మన లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమా మేకింగ్లొ కష్టపడుతూ వున్నారు.
ఆలెక్కల సూత్రాలు తీరీ ఇక్కడ ఫలించటం తో సినిమాలు హిట్ టాక్ వచ్చేలా మేకింగ్ చేస్తున్న మాస్టర్ నేడు ఓ గొప్ప దర్శకుడిగా ఎదిగారు. ఆనాటి మాస్టరే నేడు డైరెక్టర్ సుకుమార్. లెక్కల మాస్టర్ గారి లెక్కలు ఎక్కడ మిస్స్ అవ్వకుండా విద్యార్థులకు విజయాన్ని అందేలా పాఠాలు చెప్పేరో ఇక్కడ సినిమా ఇండస్ట్రిలో కూడా అంతటి ఘనవిజయం సాధించేలా పుష్ప తీసారు ఎదిగారు .ఈ చిత్రం 2021 డిసెంబరు17 న రిలిజ్ అయితే తిరిగి 2023 డిసెంబరు17 న మరలా రెండోవ పార్ట్ రిలిజ్ చేయాలని డైరెక్టర్ అనుకున్నరో ఏమో!! ఆంద్ర ఒడిస్సా సరిహద్దులో సీలేరు నది ఒడ్డున వున్న పూసగూడెం మన్యం గ్రామాల పరిసరాలలో ప్రకృతి అందాల నడుమ పొల్లూరు పోరుబాయి గ్రామాల కెనాలు వద్ద వున్న దట్టమైన అడవుల్లో కొన్ని సన్నివేశాలు చిత్రికరణ కోసం 10 రొజుల పాటు ఇక్కడ సినిమా షూటింగ్ మేకింగ్ పనుల్లొ బిజిగా వున్నారు. మైత్రి మూవి మేకర్స్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రంలో సుమారు నాలుగు వందలమంది జూనియర్ ఆర్టిస్టులు మళయాళం నటుడు పుష్పా పార్టిలేదా అనే డైలాగ్ వర్షన్ తో అందరిని ఆకట్టు కున్న ఫాహద్ ఫాషిల్ మరియు బ్రహ్మజీ తో పాటు పలువురు జూనియర్ నటుల పైటింగ్ సన్నివేశాలు షూటింగ్ సందడితో డైరెక్టర్ సుకుమార్ తో మోతుగూడెం పరిసరాల్లో చిత్రయూనిట్ పుష్ప బృందం సందడి చెస్తుంది. ఈ ప్రాంతంలో వున్న ఏ.పి జెన్కో పోరుబాయి రిజర్వాయర్ కెనాల్ ఆక్విడెట్ బ్రిడ్జి వద్ద శ్రీవళ్లి పాత్రధారిణి రస్మికమందన్నా అల్లు అర్జున్ తొ ఆనాడు ఓ సన్నివేశం తీసారు. నేడు ఆ బ్రిడ్జి పుష్ప బ్రిడ్జిగా గూగుల్ మేప్ లో సైతం మార్కు చేసుకుంది. కనువిందు చేస్తున్న పుష్ప బ్రిడ్జి వద్ద షూట్ తీసుకున్న మంటు అందరు గొప్పగా చేప్పుకుంటున్నారు.
కొత్తగా పెళ్లీ కాభోయే జంటలకు ప్రీవెడ్ షూట్ లకు ఫొటొగ్రాఫర్లకు బారిగా డిమాండ్ పెరిగింది.వారి కెమేరాల లో దృశ్యరూపంగా నిలుస్తున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రలలో వందలమంది ఇప్పటికే ఇక్కడ ప్రీవెడ్ షూట్లు సెల్పిలు తిసుకున్నారు. పుష్ప బ్రిడ్జిగా పేరు పోందుతు వందల మందికి ఉపాది కల్గేలా ప్రివెడ్ షూట్లు జరుగుతూ ఫొటొ గ్రాఫర్లకు కాసులు వర్షం కురిచేలా ఈ దృశ్యం ఉపాది కల్పిస్తు కనువిందు చేస్తుంది.ఈ ప్రాంతాభీవృద్దికి కారణం పుష్ప సినిమా సన్నివేశాలు చిత్రికరించటమే! దటీజ్ పుష్ప క్రెడిట్ గోస్టూ డైరెక్టర్ సుకుమార్ కే దక్కతుంది అనటానికి సాక్ష్యంగా నేడు మరలా ఈ సీలేరు ప్రాంత పరిసరాల్లొ షూటింగ్లకు వేదిక గా పుష్ప పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. అందుకే అంటున్నరు ఇక్కడి వారు ఏమనీ,, (హే బిడ్డా) సీలేరు గడ్డా పుష్ప అడ్డా అని ! ఇక భవిష్యత్తులొ ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ప్రాంతం “చూపే సింగారమాయేనే శ్రీవళ్లి సిలేరు పరిసర అందాలే షూటింగ్లకు నెలవాయే,, అన్నట్లు శోభిల్లాలని ఆశిద్దామా!! చివరిగా నామాటా ఉత్తముడు దేనిని ప్రమాణముగా అంగీకరించునో దానినే లొకమంతయు అంగికరించును.ఇది భగవద్గిత లోని సారంశమే అయినప్పటికి కష్టపడిపనిచెసిన వారిని గుర్తించి ఒకొక్కరి లక్షరూపాయలు బహుమతిగా అందించిన దర్శకుడు సుకుమార్ మోతుగూడెం పరిసరాల్లో షూట్ చే ఈ ప్రాంతాభివృద్దికి ఎందరికో ఉపాధి కల్పించన మార్గదర్శకుడైయ్యారు అని అందరు హర్షిస్తున్నారు. మట్టపర్తి వెంకటరమణ. రిపోర్టర్ మోతుగూడెం