ధర్మవరం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో.. గోరంట్లలో జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలు
అందజేసిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి…
గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ పర్యవేక్షణ లో ధర్మవరం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 13న జరగబోవు జిల్లా విస్తృతస్థాయి సదస్సును జయప్రదం చేద్దామంటూ తోటి జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలో అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం యూనియన్ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జీవి నారాయణ, ధర్మవరం డివిజన్ ఉపాధ్యక్షులు గోల్డ్ ప్రసాద్, సహాయ కార్యదర్శి రమణ తదితరులు గోరంట్ల మండల జర్నలిస్టులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, లీగల్ పాయింట్ మస్తాన్, జనసేన మహేష్ ఆంధ్రప్రభ లక్ష్మీనారాయణ, జనం న్యూస్ ఫక్రుద్దీన్, మనం కిష్టప్ప, సూర్య వెలుగు నర్సారెడ్డి, పబ్లిక్ వాయిస్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.