బెల్లంకొండ మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో మండల అధ్యక్షులు తోట రమాదేవి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట రమాదేవి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో మార్చి 14న జరుగునున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మండల జనసేన అధ్యక్షురాలు తోటరామాదేవి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి జనసేన అభిమానులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పల్లె పండుగతో గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి, సామాన్యుడు రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు అన్నారు. మండలంలోని ప్రతి జనసేన కార్యకర్తలు, నాయకులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
