Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Janasena

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు*

తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు.

శ్రీవారి దర్శనం అనతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

 

నా ప్రార్థనలకు సమాధానం లభించింది..

తిరుమల శ్రీవారి దర్శనానంతరం నారా భువనేశ్వరి వ్యాఖ్య

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి తన భర్త పక్కన లేకుండానే చివరి సారి స్వామిని దర్శించుకున్నానన్న భువనేశ్వరి .ఇప్పుడు ఇద్దరం కలిసి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నామని వ్యాఖ్య.

Related posts

Leave a Comment