పారిశుధ్య పనుల నిర్వహణ సరిగా లేకనివాస గృహాలలో నుంచి ప్రవహిస్తున్న నీరు..
చిలకలూరిపేట : మిచాంగ్ తూఫాన్ ప్రభావం పేట పై కూడా ఎక్కువగా ఉంది. చిలకలూరిపేట పట్టణంలో గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భారీగా చిలకలూరిపేటలో వర్షపాతం నమోదవుతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో చిలకలూరిపేట పట్టణంలో ఎన్నడు లేని విధంగా
ప్రధాన వ్యాపార వర్తక వాణిజ్య ప్రాంతమైన చౌత్రా సెంటర్ కోమల విలాస్ బజార్.మెయిన్ బజార్ . చలివేంద్రం బజార్.చంద్ర మౌళి కూరగాయల మార్కెట్ ప్రాంతం.రత్న బేకరి .గౌడ కళ్యాణ మండపం. గౌడ పాలెం విశ్వనాథ సెంటర్.కళామందిర్ సెంటర్.శివాలయం భగత్ సింగ్ రోడ్డు .రిజిష్టర్ ఆఫీస్ ప్రాంతంతో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాల్లో నివాసాలలో మోకాళ్ళ లోతు వాన నీరు మురుగు నీరు కలసి చేరింది.
ఇటీవల నరసరవుపేట వెళ్లే మార్గంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని నిర్మించిన నూతన గృహం చుట్టూతా ఉన్న కాలానిలు.బచ్చు సత్యనారాయణ నగర్.జిడ్డు కాలని ఎన్ .టి.అర్.కాలని లక్ష్మి నరసింహ కాలని,సాంబ శివ నగర్. పురుషోత్తమ పట్నంలోని శాంతి నగర్ .వినాయక నగర్,సంజీవ్ నగర్. మార్కండేయ నగర్ తదితర ప్రాంతాల్లో.మోకాలు లోతు మేరా వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.కస్తూరి బాయ్ రోడ్డులో. మద్ది నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన చీరాల రోడ్డుపై ఒక పెద్ద చెట్లు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తుఫాన్ ప్రభావంతోచిలకలూరిపేటలోచెట్లుకూలిపోతున్నాయి.
మున్సిపల్ అధికారుల వైపల్యంఅస్తవ్యస్తమైన డ్రైనేజీ విధానం
చిలకలూరిపేట చిరుజల్లులకే చిగురుటకుల వణికిపోయే చిలకలూరిపేటకు అతి భారీ వర్షాలు ప్రజాజీవాన్ని అస్తవ్యస్తం చేశాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం గా మారింది ఈదురుగాలులతో కొండపోటగా కురిసిన వర్షానికి పట్టణం నీట మునిగింది. భారీ వర్షాలకు చిలకలూరిపేట పట్టణంలోని పలు కాలనీలో వర్షపు నీరు వచ్చి చేరింది. మరోవైపు అస్తవ్యస్తమైన డ్రైనేజీ విధానం, ఆక్రమణలతో కాలువలు పారక వర్షపు నీరు రోడ్లను ముంచేట్టింది. గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారుల వైపల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. వర్షాలకు ముందే కాలువల్లో కూడికలు తీయించి అడ్డంకులు లేకుండా చూసుకోవాల్సిన అధికారులు, పాలకపక్షం నిద్ర వహిస్తూ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన వర్షం ప్రారంభమైన తర్వాత హడావుడి చేయటం విష్మయానికి గురిచేసింది.
లక్షలు వెచ్చించినా మెరుగు పడని పరిస్థితి…
లక్షలు వెచ్చించి కాలువల్లో పూడికలు తీశామని ప్రకటనలు అబద్ధమని వర్షం నిరూపించింది ఇటీవల కొంతకాలంగా పట్టణంలో ప్రధాన ట్రైన్లలో సిల్క్ తీసే పనులు చేస్తున్నట్లు పాలకులు ప్రకటించారు. వాస్తవంగా నరసరావుపేట సెంటర్ నుంచి కొంతమేర మాత్రమే కూడికలు తీసి మమ అనిపించిన శా నిటరీ అధికారులు ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారు. కానీ అన్ని ప్రాంతాల్లో సెల్ఫీ తీత పనులు చేపట్టామని లక్షల రూపాయలు బిల్లులు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కాలువలపై ఉన్న ఆక్రమణ తొలగిస్తామని స్వయానా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ సమావేశంలో ఆర్భాటంగా ప్రకటించారు కానీ ఇంతవరకు ఆ విషయంపై స్పందించకపోవడంతో చిలకలూరిపేటకు ఇటువంటి పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.