Janasena News Paper
ఐపీఎల్క్రికెట్క్రీడలుతాజా వార్తలు

IPL 2023లో భారీ సిక్స్ కొట్టిన డుప్లెసిస్.. స్టేడియం వెలుపలికి బంతి

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ డుప్లెసిస్ భారీ సిక్స్ కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ (Du Plessis) కొట్టిన బంతి స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. బంతి వెళ్లిన తీరుని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ నమ్మలేనట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఇంతకీ ఆ సిక్స్ డిస్టెన్స్ ఎంతంటే? 115 మీటర్లు.

ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగో బంతిని షార్ట్ లెంగ్త్ రూపంలో విసిరాడు. దాంతో బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లిన డుప్లెసిస్ మిడ్ వికెట్ దిశగా బంతిని బలంగా హిట్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అవడంతో బంతి సిక్స్ రూపంలో స్టేడియం వెలుపలికి వెళ్లిపోయింది. మ్యాచ్‌లో 46 బంతులాడిన డుప్లెసిస్ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో అజేయంగా 79 పరుగులు చేశాడు. దాంతో బెంగళూరు టీమ్ 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. లాంగెస్ట్ సిక్స్ రికార్డ్ ఆల్బీ మోర్కెల్ పేరిట ఉంది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన ఈ ఆల్బీ మోర్కెల్ 125 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ (124 మీటర్లు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (122), రాబిన్ ఉతప్ప (120), క్రిస్‌గేల్ (119), యువరాజ్ సింగ్ (119) టాప్-6లో కొనసాగుతున్నారు.

Related posts

Leave a Comment