భారత రాజ్యాంగ నిర్మాత, పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వారికి గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి వారి జన్మదినం సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శులు బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొర్ర శ్రీను నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుంటూరు నగర కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుసరించిన మార్గం,వారు సూచించిన రాజ్యాంగం ఎంతో ముఖ్యమని దళిత బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలియజేశారు.
ఆ మార్గాన్ని భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శి కొర్ర శ్రీను నాయక్ ఇప్పటికీ వారు సూచించిన మార్గాన్ని అనుసరిస్తున్నానని తెలియజేశారు.
