జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అభినందన.
అతి సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చి అఖిల భారత స్థాయిలో నీట్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఆలిండియా 362వ ర్యాంకు సాధించిన చందు శ్రవణ్ కుమార్ ని ప్రత్యేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ అభినందన పత్రం తెలియజేస్తూ గుంటూరులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా అధ్యక్షులు ఆశీస్సులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వారి తండ్రి జనసేన పార్టీ 32 వ డివిజన్ చందు శ్రీనివాసరావు పార్టీకి వారు అందించిన కృషి అసమాన్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి,దాసరి లక్ష్మీ దుర్గ,జనసేన పార్టీ నగర కార్యదర్శిలు కొత్తకోటి ప్రసాద్, బొడ్డుపల్లి రాధాకృష్ణ గుంటూరు నగరంలోని పలు డివిజన్ల అధ్యక్షులు మధు, లాల్,నరసింహారావు అందరూ పాల్గొని ఈ సందర్భంగా చందు శ్రవణ్ కుమార్ ని అభినందనలతో తెలియపరిచారు.
