తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (TJU) జిల్లా అధ్యక్షులు షానూర్ డిమాండ్
భువనగిరి జనసేన ప్రతినిధి 2 మే : మంగళవారం ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రహదారి బంగ్లాలో* ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అలాంటి జర్నలిస్టుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ నెలకు రూపాయలు 25,000 చొప్పున గౌరవేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు గౌరవేతము ఇస్తున్న విషయము తెలిసిందే.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శనిగరం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్ కార్యవర్గ సభ్యులు చింతకింది వెంకటేశ్వర్లు, వంగరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.