హైదరాబాద్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తన ప్రచ్చన్న యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి లేఖల యుద్ధానికి తెరతీసింది. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మొదలుపెట్టి కేంద్రానికి ప్రతిక్షణం కంటిమీద కునుకు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, గిరిజనుల రిజర్వేషన్ల అంశం ఇలా వివిధ అంశాలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలను కూడా భాగస్వాములను చేసి ఉత్తరాల ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
Related posts
- Comments
- Facebook comments