Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీకాకుళం

కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం…

ఇచ్చాపురం:

కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం…

వ్యాపార లావాదేవీలే కారణం…

ఇచ్చాపురం కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జు నారాయణరెడ్డి పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం కి పాల్పడ్డారు.. సంతపేట వద్ద తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలో చొరబడి తలుపులు వేసి అత్యంత దారుణంగా చిదగబాదారు.. తలకు, శరీరంకు తీవ్ర గాయాలు అయ్యాయి.
దాడి చేయడంతో అపస్మారక స్థితి కి వెళ్లిపోయాడు.
దీంతో తన వద్ద ఉన్న సెల్ ఫోన్లు బైకులు దుండగులు దొంగలించిపోయారు.

స్థానికుల సహాయంతో వాసంతి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం గుజ్జు నారాయణరెడ్డి చికిత్స పొందుతున్నాడు. ప్రాణ హాని ప్రమాదం ఏమీ లేదని త్వరలో కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారు… ఈ విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితుల నుంచి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై గోవిందరావు తెలిపారు. నారాయణరెడ్డి కి ఈ మధ్యకాలంలో జరిగిన వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకొని పోలిసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ప్రజలు కోరుతున్నారు..

Related posts

Leave a Comment