అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర.

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్ లో ఏర్పాటుచేసిన హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడ నుంచి రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్ జంక్షన్ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు.
నాలుగు గంటలకు నెహ్రూచౌక్ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు