వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువు
- 35వ డివిజన్ సంఘమిత్ర కాలనీలో 22వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం.
- జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత.
అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 05:రాష్ట్రంలో మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలు, దాడులను అరికట్టడంలో వైకాప ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఆరోపించారు. సోమవారం నాడు మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 22వరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 35వడివిజన్ సంఘమిత్ర కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకొని మహిళలతో మాట్లాడుతూ…
మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాలుగేళ్ల నుంచి మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని రాష్ర్టంలో దిశా చట్టం ఎక్కడా పని చేయడంలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రతి 8 గంటలకు ఒక మహిళపై అత్యాచారం రోజుకు 50 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు జగన్ రెడ్డి హయాంలో 70% ఆడవాళ్ళపై పెరిగిన మిస్సింగ్ కేసులు మైనర్ బాలికలపై రేప్ కేసుల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని ఆరోపించారు. ప్రజలు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్,టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీసుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.