Ap : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎలీ ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో వరద నీటిలో తడిచిన LG ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచితంగా సర్వీస్ అందిస్తామని ప్రకటించింది. స్పేర్ పార్టులపై 50శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఖమ్మంలోనూ ఇవే సేవలు అందిస్తామంది.
వరదల్లో ఎల్జీ వస్తువులు పాడైతే తమను సంప్రదించాలని కోరింది. ఉచిత సర్వీస్ కోసం 08069379999, 9711709999 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.