పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి,రిగ్గింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని,రిగ్గింగ్ చేసిన పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ జరపాలని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి రవిబాబు అన్నారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన కూటమి నాయకుల ఎన్నికల అక్రమాలపై ప్రజాసంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడేటటువంటి కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు బెదిరింపులు దాడులు రిగ్గింగ్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల అక్రమాలు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పోలింగ్ అధికారులు,పోలీసులు వవిఫలమయ్యారని అన్నారు. పోలింగ్ స్టేషన్ అధికారులుగా ఆయామండలంలో పనిచేసే అధికారులులేదా పక్క మండలాల్లో పనిచేసే అధికారులని నియమించటం ఎన్నికల నియామావళ్ళికి విరుద్ధమని అన్నారు. కనీసం రెవిన్యూ డివిజన్ లు అయినా మార్చి విధులు వేయమని ఫిర్యాదు చేసినప్పటికీ ఆ విధంగా చేయలేదని ఆయన అన్నారు. పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల పరిధి లోపల గుంపులు గుంపులుగా ప్రజలు ఉండకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్ వద్దనే గుంపులు గుంపులుగా కూటమి నాయకులు కార్యకర్తలు ఓటర్లను, పిడిఎఫ్ ఏజెంట్లను బెదిరించటం హల్ చల్ చేస్తుంటే చేస్తుంటే పోలీసు యంత్రాంగం వారిని నివారించడంలో విఫలమైందని అన్నారు. పెదకూరపాడు లో పిడిఎఫ్ అభ్యర్ది తరఫున గుర్తింపు కార్డు తీసుకున్న పోలింగ్ ఏజెంట్లను వారి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టి పోలింగ్ స్టేషన్ కు రానియకుండా చేశారని, బెల్లంకొండ అచ్చంపేట పోలింగ్ స్టేషన్లో ఇద్దరు ఏజెంట్లను పోలింగ్ లో కూర్చున్న తర్వాత కూటమి నాయకులు పిడిఎఫ్ ఏజెంట్ల కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దగ్గరుండి బయటకి తీసుకు వెళ్లారని,అమరావతి పెదకూరపాడు క్రోసూరు అచ్చంపేట బెల్లంకొండ మండలాల ప్రజా సంఘాల ప్రధాన బాధ్యులను ప్రలోభ పెట్టాలని చూడటం,వారు జీవనం కోసం చేసుకునేటువంటి వివిధ వృత్తుల్లో ఇబ్బందులు పెడతామని బెదిరించడం చేసి వాటికి కూడా దడవకుండా ఉండటం వలన బెల్లంకొండలో ప్రజా సంఘాల ప్రధాననాయకులైన చిన్నం పుల్లారావు,భుతుకూరి నరసింహారెడ్డి లను దొంగ ఓట్లు వేసుకోవడానికి రిగ్గింగ్ చేసుకోవటానికి సహకరించాలని బెదిరించగా ప్రతిఘటించిన పుల్లారావు నరసింహారెడ్డిలపై దాడి చేసి గదిలో బంధించగా పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే లోపే కూటమి నాయకులు పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించారని తెలిపారు .బెల్లంకొండ ఎస్సై తో ఎందుకు మా ఏజెంట్లను తీసుకువచ్చారనా అడుగగా తిట్టినట్లు ఫిర్యాదు చేశారని చెప్పి పిడిఎఫ్ ఏజెంట్లు మాత్రమే న్యూసెన్స్ చేస్తున్నారని ఒకటికి రెండు సార్లు చెప్పిన వినలేదని తప్పుడు కేసుతో పోలీసులు తాసిల్దారు ముందు బైండోవర్ చేశారని ఆయన తెలిపారు. క్రోసూరులో పిడిఎఫ్ ఏజెంట్ అయిన తిమిశెట్టి హనుమంతరావు దొంగ ఓట్లు పోలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా తెలుగుదేశం నాయకుడు కంచేటి సాయికుమార్ అతని అనుచరులు సుమారు 40 మంది హనుమంతరావును చుట్టుముట్టి బయోత్పాతాన్ని సృష్టించి రిగ్గింగ్ చేసుకోవడం జరిగిందని తెలిపారు.పిడిఎఫ్ ఏజంట్లను వారి బంధువులను మాకు సహకరించకపోతే దాడి చేసి ఏమైనా చేస్తామని బెదిరించడం జరిగిందని తెలిపారు.అచ్చంపేట పోలింగ్ స్టేషన్లో దొంగ ఓట్లు వేయటానికి ప్రతిఘంటించి నందుకు గాను ప్రతిఘటించిన ఏజెంటు కేకే రెడ్డిని మమ్మల్ని ప్రశ్నిస్తావా బయటికి రా నీ సంగతి చూస్తామని బెదిరించగా పోలింగ్ స్టేషన్ నుండి బయటికి వెళుతున్నటువంటి ఏజెంట్ కేకే రెడ్డి వెంట పడటం జరిగిందని అన్నారు. అతనికి పోలీసు యంత్రాంగం రక్షణ కల్పించాలని అన్నారు. దొంగ ఓట్లు వేయటానికి వస్తున్న వారిని పిడిఎఫ్ పోలింగ్ ఏజెంట్లు వీరు దొంగ ఓటు వేయటానికి వచ్చారని పోలింగ్ అధికారులకు పోలీసులకు చెప్పినప్పటికీ వారిని బయటికి పంపించడానికి నిరోధించటానికి పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలింగ్ అధికారులను పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా కుటమినాయకులు తమ ఆధీనంలోకి తీసుకొని దుర్మార్గమైన ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. బెల్లంకొండలో పిడిఎఫ్ ఏజెంట్లు పై దాడి చేసిన వారిని,అదేవిధంగా క్రోసూరు 341 పోలింగ్ స్టేషన్లో రిగింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దొంగ ఓట్లు వేయటానికి ఆడవాళ్ళ పేర్లతోటి మగవాళ్లు,యువకుల పేర్లు తోటి ముసలివాళ్లు,ముసలి వాళ్ళ పేర్లతోటి యువకులు అసలు ఎటువంటి చదువు లేనటువంటి వారి చేత కూడా దొంగ ఓట్లు వేయించారని వాటిని ప్రతికటించినటువంటి పిడిఎఫ్ ఏజెంట్లను బెదిరించటం దాడి చేయటం చేశారని కూటమి నాయకులు చేసినటువంటి ఎన్నికల అక్రమములను ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఖండించాలని కోరారు.ప్రజల విశ్వాసాన్ని చురగొనకుండా అక్రమాల ద్వారా విజయాలు పొందాలని అనుకోవటం దుర్మార్గమని అన్నారు.ఈ సమావేశంలో సిఐటియు,రైతు,కౌలు రైతు, కెవిపిఎస్,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గర్నెపూడి మహేష్,చిలక యేసయ్య,కత్తుల గోపి కృష్ణారెడ్డి, నాగ సంధ్య
ఆవులఆంజనేయులు,కంచేటి పెద్దబ్బాయి, రావెళ్ళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
