విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఎంపీడీవో పి జె విలియమ్స్ పదవి విరమణ సన్మాన సభలో వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా పదవి విరమణ చేస్తున్న విలియమ్స్ కు ఏర్పాటుచేసిన సన్మాన సభలో పలువురు ఎంపీడీవోలు తాసిల్దారులు శాఖ పరమైన సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిజె విలియమ్స్ సౌమ్యుడని క్షేత్రస్థాయి నుంచి ఎదిగి అవిశ్రాంతంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించారన్నారు. అనంతరం విలియమ్స్ దంపతులను ఘనంగా శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి అభినందన తెలియజేశారు. ఈ పదవి విరమణ వీడ్కోలు సభలో ముప్పాళ్ళ తహసిల్దార్ భవాని శంకర్,రాజుపాలెం ఎంపీడీవో సత్యనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీప్రసాద్,ఇవోపిఆర్డి రూపవతి,పలుశాఖల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు….

