Janasena News Paper
పల్నాడు

ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినిలకు  పరీక్ష సామాగ్రి పంపిణి.

ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినిలకు నరసరావుపేట పట్టణానికి చెందిన కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్)ఆర్థిక సహకారంతో పరీక్ష సామాగ్రి పంపిణి. ఈ.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ సాధికారత నోడల్ అధికారి  ఆర్ అరుణ విచ్చేసి మాట్లాడుతూ  అలసట లేకుండా ఆరోగ్యాని కాపాడుకుంటూ తగినంత సమయం నిద్రకు కేటాయిస్తూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళిక ప్రకారం అర్థం చేసుకొని చదవడం  ముఖ్యమని అన్నారు. కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్) మాట్లాడుతూ జీవితంలో రాసి మొట్టమొదటి పరీక్ష పదవ తరగతి కావున శ్రద్ధ పట్టుదలతో చేసే ఏ పని అయినా విజయం సాధిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముందుగా నైటింగేల్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ  సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లి బాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ  తల్లిదండ్రులకు గురువులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్ప్ ఫౌండేషన్ యూత్ కోఆర్డినేటర్ మురళి ఉపాధ్యాయులు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment