ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర,సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు.రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు.అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఈ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు….

