Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడరాజకీయం

గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప

*గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప*

ఆoధ్రప్రదేశ్ గంజాయి అడ్డాగా మారిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఆంధ్రప్రదేశ్లో 26% వాటా ఉన్నట్లు ఎన్సీబీ నివేదిక పేర్కొంటుందని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో ఉపాధి కల్పనగా గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో యువత ఆరోగ్యానికి కూడా భద్రత లేకుండా పోయిందన్నారు.

రాష్ట్రం నుంచి రోజుకు టన్నుల కొద్దీ గంజాయి రవాణా అవుతున్నా కేవలం 1775 కేసుల మాత్రమే నమోదయ్యాయి. గంజాయి మాఫియాకు వైసీపి నేతలు ఏ విధంగా సహకారిస్తున్నారో స్పష్టమవుతోంది. ప్రధానంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల విజయనగరం మరియు విశాఖపట్నం గంజాయి రవాణాకు కేంద్రంగా మారాయని ఎమ్మెల్యే రాజప్ప ఆరోపించారు.

Related posts

Leave a Comment