Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

బదిలీపై వెళుతున్న జిల్లా యస్.పి. కి ఘన వీడ్కోలు పలికిన జిల్లా పోలీసు యంత్రాంగం

బదిలీపై వెళుతున్న జిల్లా యస్.పి. కి ఘన వీడ్కోలు పలికిన జిల్లా పోలీసు యంత్రాంగం

నెల్లూరు, జనసేన ప్రతినిధి ఏప్రిల్ 11: బదిలీపై వెళుతున్న జిల్లా యస్.పి సి హెచ్ విజయ రావు కు ఘన వీడ్కోలు పలికారు.పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు వీడ్కోలు పెరేడ్ ఘనంగా నిర్వహించారు. అధ్బుతంగా ఉందని అభినందించిన యస్.పి సి హెచ్ విజయరావు అభినందనలు తెలిపారు.సున్నిత అంశాలను నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ హెచ్ జి నుండి అడిషనల్ యస్.పి. వరకు సహకరించిన అందరికీ ఎస్ పి విజయరావు ధన్యవాదాలను తెలిపారు.సివిల్, ఏ ఆర్, ట్రాఫిక్, డి ఎస్ పి, దిశ, లా & ఆర్డర్ స్టేషన్లు అందరూ చాలా బాగా విధులు నిర్వహించారు.మీ కుటుంబానికి మీరు చాలా ముఖ్యం.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని ఎస్ పి విజయరావు సూచనలు చేశారు.

జిల్లాలో 21 నెలల పాటు నిర్వహించిన విధులతో ఎన్నో స్మరించుకునే స్మృతులు అందించారన్నారు.పోలీస్ ల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. స్పెషల్ పార్టీలను బలోపేతం చేసామన్నారు.ఏఆర్ విభాగం లేని విధులు లేవన్నారు-అన్ని విభాగాలలో నిక్షిప్తమై ఉంటారని విజయరావు అన్నారు.వివిధ రకాల స్థాయి, ప్రదేశాలలో అన్ని విధులను ఒక బృందంగా కలిసి ఎటువంటి సంఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించామన్నారు.జిల్లాలో 21 నెలల పాటు చేసిన వారి సేవలను కొనియాడి,ఎస్పీ ని జిల్లా పోలీసు యంత్రాంగం శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఏ ఆర్ విభాగాన్ని వెన్నెముకతో పోల్చడం చాలా సంతోషంగా ఉంది-అడిషనల్ ఏ ఆర్ యస్.పి అన్నారు.జిల్లా యస్.పి. ఆధ్వర్యం విధులు నిర్వించడం చాలా సంతోషంగా ఉందన్నారు.విజయరావు ఎస్ పి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా పోలీసు అధికారులుఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం యస్.పి.ని పెరేడ్ గ్రౌండ్ నుండి క్యాంప్ ఆఫీసు వరకు జైజై నినాదాలతో పూల వాహనంపైజిల్లా పోలీసు అధికారులు స్వయంగా లాగుతూ ఘన వీడ్కోలు పలికారు.

Related posts

Leave a Comment