మృతుడి ఇంటికి వచ్చి అదృశ్యమయ్యాడు
పెదకూరపాడు, మండలం, ఫిబ్రవరి 13, జనసేన ప్రతినిధి :
మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వచ్చి అదృశ్యం అయిన సంఘటన పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. కథనం ప్రకారం బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎల్లపాడు గ్రామానికి చెందిన జార్జ్(70), ఫిబ్రవరి 11వ తేదీన పాటిబండ్లలో తన వియ్యపురాలు రూతమ్మ అనారోగ్యంతో మృతి చెందటంతో చూడడానికి వచ్చారు కార్యక్రమం ముగించుకొని వెళ్లే సమయంలో కనిపించకుండా పోయారు.