రాజుపాలెంరూరల్,మార్చి15,జనసేన ప్రతినిధి….
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాజుపాలెం మండలం,నెమలిపురిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సాహించాలన్నారు.. సచివాలయం సిబ్బంది వారి వారి సామాగ్రిని జూట్ బ్యాగులు లో తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రజలు స్వచ్ఛత కార్యక్రమాన్ని అర్థం చేసుకొని పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలన్నారు.చెత్తను ఎక్కడoటే అక్కడ పార వేయకుండా చెత్త సేకరణకు వచ్చిన వారికి అందజేయాలన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భాస్కర రెడ్డి,మండల రెవెన్యూ అధికారి దుర్గేష్,సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు…..

