రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి

రాజుపాలెం మండలంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజుపాలెం మండలం జనసేన పార్టీ నాయకుడు,బీరవల్లి పాయ సర్పంచ్ పసుపులేటి వెంకట స్వామి.ఈ సందర్భంగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుందో అనడానికి రాజుపాలెం మండలంలో వంద పడకల హాస్పిటల్ మంజూరు చేయటం ఒక నిదర్శనం అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టిన తర్వాత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,దానిలో భాగంగా సత్తనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజుపాలెం మండలంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా రాజుపాలెం మండల ప్రజలు,జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మండలానికి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కృషి ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉన్నారని, దానికి నిదర్శనమే రాజుపాలెం మండలంలో వంద పడకల హాస్పటల్ ఏర్పాటు చేయటం గొప్ప విషయమని,ఇది పేద, బడుగు బలహీన వర్గాల ఉపశమనం కలిగిస్తుందని, మండలంలో వంద పడకల ప్రభుత్వ హాస్పటల్ ప్రకటించడం, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుందో అనడానికి హాస్పటల్ మంజూరు చేయటం ఒక నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.