మండల న్యాయ సేవాధికార సంస్థ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల న్యాయ సేవ సాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి వి విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ముఖ్యంగా చిన్నారి విద్యార్థులపై జరుగుతున్న ఆకృత్యాలు వేధింపులు ఏ విధంగా ఎదుర్కోవాలో మొదలైన విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థులకు 40 మంది కి పెన్నులు పరీక్షా ప్యాడ్ స్కేల్ అందించారు ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలి సైదా ప్యానల్ లాయర్ బిఎల్ కోటేశ్వరరావు వెంకట శివ పారా లీగల్ వాలంటీర్ సుభాని తదితరులు పాల్గొన్నారు.


