చదువు,మనిషి యొక్క సంస్కారాన్ని, నడవడికను, మారుస్తుంది. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. గన్నమనేని శ్రీనివాసరావు…
చదువు,వ్యక్తి యొక్క జీవన శైలిని, ఆర్ధిక పరిస్థితులను, గౌరవాన్ని, వాళ్ళ కుటుంబ పరిస్థితులను, వ్యవస్థలో మార్పును మనం గమనించవచ్చు.తద్వారా మీ చుట్టూ ఉన్న సమాజం కూడా అభివృధి చెందుతుంది. మీ భవిష్యత్ కు మీరే భాద్యులు.
పదవ తరగతి పరీక్షలు సిద్దమవుతున్న ప్రతి విద్యార్థి ప్రశాంతముగా, ఏ వత్తిడి లేకుండా,పరీక్షలు వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని,భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించాలని, తల్లితండ్రులకు, మీ పాఠశాలకు,మీ ఉపాధ్యాయులకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి.అలానే భవిష్యతులో ఉన్నత స్థాయికి చేరుకోని మీ తోటివారికి సహకారంగా నిలవాలని ఆశిస్తున్నామని వక్తలు తెలియచేసారు….శనివారం 15-3-2025 న పట్టణం లోని 13 వ వార్డ్ లో ఉన్న విద్యాకేంద్రం పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శంకర్ నారాయణ (డిక్షనరీ). నిఘంటువు, నోట్ బుక్స్, మెటీరియల్ ఇవ్వటమైనది.
17/3/2025. నుండి 10 వ తరగతి పరిక్షలు వ్రాయుటకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి వారికి అవసరమైన పరీక్ష కిట్ గన్నమనేని శ్రీనివాసరావు సహకారంతో అందించటమైనది. పాఠశాల డైరెక్టర్ డి .వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు జి.వి. నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు అందరూ శుభాకాంక్షలు తెలియచేసారు…..
