ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడు గ్రామంలో గ్రామపంచాయతీకి రు. 2లక్షల రూపాయలు టోకరా వేయడంతో గ్రామప్రజలు విస్తుపోయారు.ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడు గ్రామం లో చాపల చెరువుకి ప్రతి సంవత్సరం రు. 2లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది.ఈ సంవత్సరం ఎలాంటి పన్ను చెల్లించకుండా చెరువులోని చేపలను పట్టుకుంటూ గ్రామపంచాయతీకే టోకరా వేశాడు గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి.చెరువు కట్టలను సొంతింటి వలె గుడిసెలు వేసి కోళ్ల పెంపకం, సోలార్ తో విద్యుత్ సరఫరా కూడా చేశాడు..గతంలో రెండు సంవత్సరాలు పంచాయతీ తీర్మానంతో పాట పెట్టడంతో పంచాయతీకి డబ్బులు కట్టి చేపలు పట్టుకున్న పల్లె శివారెడ్డి అనే పెద్ద మనిషి ఈ సంవత్సరం ఎటువంటి పాట లేకుండా, తీర్మానం లేకుండా,తన స్వంత చెరువు లాగా ఎటువంటి డబ్బులు కట్టకుండా
నీటిని వెళ్ళబెడుతూ వలలతో చేపలను పట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడీ పెద్ద మనిషి పల్లె శివారెడ్డి.ఇలాంటి దారుణం గతంలో ఎన్నడూ జరగలేదని ఇప్పుడు ఈ శివారెడ్డి ఎవరి అండదండలతో ఈ పని చేస్తున్నాడోనని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
