Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఘనంగా న్యాయవాది రహీమ్ జన్మదిన వేడుకలు…

పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు, గుమస్తాలు.

సత్తెనపల్లి,ఏప్రిల్12,జనసేన ప్రతినిధి..

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది సయ్యద్ అబ్దుల్ రహీమ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

కక్షిదారులకు సత్వరమే న్యాయ సేవలు అందించడంతో పాటు ప్రతి ఒక్కరితో న్యాయవాది రహీమ్ స్నేహభావంతో మెలుగుతూ ఉంటారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. భవిష్యత్తులో ఇదే విధంగా ఉంటూ నిండు నూరేళ్లు జీవించాలని పలువురు ఆకాంక్షించారు.

తొలుత న్యాయవాది కేకు కోసి పలువురుకి పంపిణీ చేశారు. అనంతరం పలువురు న్యాయవాదులు ఆయన్ని దుశ్యాలవులతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్, న్యాయవాదులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, ఇరగంటి ఎల్లారెడ్డి, మర్రి వెంకట సుబ్బారెడ్డి, ఏపీపీ బగ్గి నరసింహారావు, దాసరి జ్ఞానరాజ్ పాల్, అంకాళ్ళ వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ విజయ్ కుమార్, చావా బాబురావు, రాజవరపు శివ నాగేశ్వరరావు, నరసింహారావు, ఎం.ఏడుకొండలు,కాశీమాల మార్క్, బాదినీడి శ్రీనివాస యాదవ్, మామిడి ప్రకాష్ రావు, సాంబశివరావు, పిల్లి సుధీర్ బాబు, శావ నాగేశ్వరరావు(జోజి ), పూర్ణ, బగ్గి పవన్ కుమార్, న్యాయవాది గుమస్తాలు కోటిరత్నం, రమేష్,శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment