Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పీ ఫోర్ అంటే పేదలను బానిసలుగా చేయడమే.    

పాత్రికేయ సమావేశంలో చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి…

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానం అంటే పేద ప్రజలను పెట్టుబడుదారులకు బానిసలుగా చేయటమేనని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నర  కోట్ల పైచిలుకు ప్రజలలో సుమారు 40 నుంచి 50 లక్షల మంది దారిద్ర రేఖకు దిగువున జీవిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఈ కుటుంబాలను ధనవంతులు చేయాలని ఉద్దేశంతో ఈ పి ఫోర్ విధానాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. ఈ పి ఫోర్ విధానములో మధ్యలో ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నారంటే 10 శాతం కూడా లేని పెట్టుబడుదారి వ్యవస్థకు వీరిని బానిసలుగా చేయాలని కుట్రపూరితంగా వివరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇది ఇప్పుడుది కాదని మహాత్మా గాంధీ ధర్మకతృత్వ అనే  సిద్ధాంతం తీసుకొచ్చారని ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణలో 1951 లో వినోభా భావే భూదాన ఉద్యమాన్ని తీసుకొస్తే భూస్వాములు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. 1995 తర్వాత ఎన్టీ రామారావును చంద్రబాబు వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పి త్రీ విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.

గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి       సామాన్యుడు ఆకలని అజెండాగా తీసుకొని సంక్షేమ ఫలాలతో ప్రజా రంజిక పరిపాలన సాగించాలన్నారు. హెరిటేజ్ సంస్థ రూ.6, 7 వేల కోట్లు లాభాల్లో ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి ఆ లాభాలను పేదలకు పంచుతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ పి ఫోర్ విధానం మీయొక్క హెరిటేజ్ సంస్థ నుంచే ప్రారంభించాలని ఆయన సూచించారు.

Related posts

Leave a Comment