నోముల వెంకట చలపతిరావు, బీజేపీ సీనియర్ నాయకులు
సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు
వారి సహాయకులకు 120 మందికి ,జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ
పథకంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖులు మయూరి కొండలు (శీలం ఏడుకొండలు) గారి ఆర్ధిక సహాయంతో వారి చేతులమీదుగా భోజనం అందించటం జరిగింది.స్వచ్ఛందంగా శీలం ఏడుకొండలు ఈ పధకంలో ఈ రోజు ముందుకు రావటం మంచి పరిణామం అని అన్నారు.
ఈనాటి కార్యక్రమంలో భాజపా నాయకులు నోముల వెంకట చలపతిరావు, వేపూరీ వెంకటేశ్వర్లు, మందపాటి శ్రీనివాసరావు,జవ్వాజి రామమోహనరావు, పోతుగంటి నరసింహారావు, పోతుగంటి రామకోటేశ్వరరావు,కటకం విశ్వనాధం,నర్సింగ్ సూపర్నెంట్ రాధా,దివ్వెల శ్రీనివాసరావు,కట్టమూరీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం పాలనలో దాతల సహకారంతో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఈ మంచి సేవా కార్యక్రమము ఎంచుకోవటం అభినందనీయం అని పలువురు అన్నారు.