Janasena News Paper
పల్నాడు

ప్రధానోపాధ్యాయుడిగా మీసేవలు మరువలేం : ఎంఈఓ…

సత్తనపల్లి పట్టణంలోని యం.పి.పి (ఎస్.ఆర్.బి.ఎన్) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఖాదర్ మస్తాన్ పాఠశాలకు చేసిన సేవలు మరువలేమని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి పాఠశాల మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎం  ఏడుకొండలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. మాస్టారు ఏ పని చేయటానికైనా ముందుంటారని, ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి పాఠశాల ప్రారంభ సమయానికి సిద్ధం చేశారన్నారు. రెండవ విద్యాశాఖ అధికారి రాఘవేంద్రరావు  మాట్లాడుతూ ఉద్యోగంలో పదవి విరమణ తప్పదన్నారు. ప్రధానోపాధ్యాయులు మృదుస్వభావి సౌమ్యుడు అన్నారు. ఎక్స్ పేరెంట్స్ కమిటీ చైర్మన్,న్యాయవాది ఏడుకొండలు మాట్లాడుతూ గురువు ఎలా ఉండాలో చెప్పటానికి  నిదర్శనం   ఖాదర్ మస్తానని, ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతగా కాకుండా, ఇష్టంగా, ప్రేమగా చేసే వ్యక్తని, ప్రధానోపాధ్యాయులు సహకారం వాళ్ళనే త్వరితగతిన స్కూలు నిర్మాణం జరిగిందని, స్కూల్ నిర్మాణంలో ఆయన పాత్ర మరువ లేనిదాన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు సంద్య, సైద, మహాబున్నిస,శ్రీలక్ష్మి ప్రధానోపాధ్యాయుల సహకారం మరో లేనిదాని చెదరని చిరునవ్వు ఎలాంటి పనులైన సునాయాసంగా చేసే నేర్పు ఆయన సొంతమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment