బెల్లంకొండ ఆగస్టు 06, జనసేన ప్రతినిధి

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు మండలంలోని మాచయపాలెం సెక్టర్ వెంకటాయపాలెం గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7వ.తేదీ వరకు జరుగుతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ వనజ తెలిపారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వనజ మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు తల్లిపాల యొక్క ఆవశ్యకత గురించి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలనిసూచించారు. తల్లిపాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.తల్లిపాలు ఇవ్వకపోవడం వలన కలిగే నష్టాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వెంకాయమ్మ , భవాని, బాలింతలు పాల్గొన్నారు.