సత్తెనపల్లి రూరల్, డిసెంబర్ 29,జనసేన ప్రతినిధి…..

కొమెరపూడి గ్రామపరిధిలో జనవరి 2వ తేది నుండి 4వ ఫేస్ లొ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే అనగా
రీ సర్వే మొదలుకాబోతుంది. సదరు రీసర్వే పై కొమెరపూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించుటకు గ్రామరెవెన్యూసిబ్బంది ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదిన అనగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కొమెరపూడి గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభలో సత్తెనపల్లి మండల తహశీల్దార్ కే యస్ చక్రవర్తి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి బోసుబాబు, మండల సర్వేయర్ టి విజయ్ కుమార్,వారి సిబ్బంది పాల్గొని రీసర్వే గురించి కూలంకుశంగా వివరంచి రీసర్వే పై రైతులకు, భూయజమానులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజల అవగాహన కొరకు కొమెరపూడి గ్రామ విధులలో రీసర్వే అవగాహనా ర్యాలీ నిర్వహించియున్నారు.ఈ రీసర్వే గ్రామ సభలో కొమెరపూడి గ్రామ సర్పంచ్ కే అనిల్ కుమార్, గ్రామ నాయకులు యర్ర వెంకటేశ్వరరావు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గుంటూరు షేక్ బడా అలీ, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

