చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్..
అమడగూరు, డిసెంబర్ 1 జనసేన ప్రతినిది:
మండల పరిధిలోని చీకిరేవులపల్లి,రెడ్డివారిపల్లి,శీతిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం తహసీల్దార్ వెంకటరెడ్డి రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ప్రతినెల ఒకటవ తేదీన రేషన్ కార్డు లబ్దిధారులకు సకాలంలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నామన్నారు.
అంతేకాక యండియంయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకు వెల్లి అందజేయాలని సూచించారు. అదేవిధంగా రేషన్ పంపిణీ లో డీలర్లు గానీ యండియంయూ ఆపరేటర్లు అవకతవకలకు పాల్పిడితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది ,డీలర్లు పాల్గోన్నారు.