
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ ఎన్నికల ఇన్ఛార్జ్ సుర్కంటి వెంకట్ రెడ్డి, వీరమల్ల సత్తయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్య కర్తలు పని చేయాలన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలన్నారు.

