ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ కలిగిన నిషేదిత సిగరెట్ల పట్టివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ శ్రీ కుమార్ విశ్వజిత్ IPS ఆదేశముల ప్రకారం తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన శ్రీ కె ఈశ్వర రెడ్డి ఆద్వర్యంలో తిరుపతి విజిలెన్స్ అధికారులు తేది 30.11.2023 రాత్రి 10:30 గంటలకు చెన్నై కలకత్తా నేషనల్ హైవే పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలను తనికీ చేయుచుండగా నిషేదిత సిగరెట్లను సరైన బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేయుచున్న లారీ కంటైనర్ ను గుర్తించి స్వాదీనం చేసుకోవటం జరిగినది. సదరు నిషేదిత సిగరెట్ల విలువ సుమారు రూ.1,81,38,000/- (అక్షరాల ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు). తదుపరి చర్య నిమిత్తము సదరు కంటైనర్ ను మరియు డ్రైవర్ ను దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ వారికి అప్పగించటం జరిగినది.
ఈ తనిఖీలలో తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన శ్రీ కె ఈశ్వర రెడ్డి తో పాటుగా ఇనస్పెక్టర్లు శ్రీ కే. వెంకట రవి, ఎస్.చంద్రశేఖర్ మరియు ఎస్.నాగ సురేష్, డీఇఇ మరియు జి. విజయకుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు.
ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి,తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి….
కే.ఈశ్వర్ రెడ్డి.