Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణరంగారెడ్డి

భాష్యం బ్లూమ్స్ లో.. విద్యార్థులకు వేధింపులు

చిన్నారులు టాయిలెట్ వెళ్తే.. సిబ్బంది దాడులు
కనీస సౌకర్యాలు లేకుండా..అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన
పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పేరెంట్స్ డిమాండ్
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

ఎల్బీనగర్, జనసేన, ఇంచార్జి, ఏప్రిల్ 3: పాఠశాలలో చిన్నారులను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన యాజమాన్యం.. చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న సంఘటన హయత్ నగర్ భాష్యం స్కూల్లో చోటు చేసుకుంది. కార్పొరేట్ పాఠశాల అంటూ.. భారీ మొత్తంలో ఫీజుల్లో దండుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు, సదుపాయాలు కల్పించవలసిన యాజమాన్యం అవేమీ కల్పించకుండా.. ఫీజులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో ప్రాథమిక స్థాయి చిన్నారులు మలమూత్ర విసర్జన చేస్తే.. టీచర్లు, ఆయాలు చిదరించుకోవడంతోపాటు చేయి చేసుకుంటున్నారని మండిపడ్డారు.

పాఠశాలలో చిన్నారులు ఆడుకోవడానికి కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేదని.. గేమ్స్ పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 వ తరగతి విద్యార్థులకు రూ.65 వేలకు పైగా ఫీజును వసూలు….7 వ తరగతి విద్యార్థులకు రూ. 75 వేలు వసూలు… చేస్తున్నారని.. ఫీజు చెల్లించకుంటే ఇంటికి పంపిస్తున్నారని చెప్పారు. సీబీఎస్సీ పాఠశాల అంటూ అనుమతి లేకుండా నడిపిస్తున్నారని పేరెంట్స్ ఆరోపించారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ.. తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్నారని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనన్నట్లు చెప్పారు. పలుమార్లు మండల విద్యాధికాధికారి, జిల్లా అధికారి, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆరోపించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి.. పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేసి కలెక్టర్ కార్యాలయం ను ముట్టనించనున్నట్లు పేరెంట్స్ తెలిపారు. అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో.. పెద్ద ఎత్తున ఆందోళన పడతామని తల్లిదండ్రులు హెచ్చరించారు.

Related posts

Leave a Comment