త్వైకాండోలో ఎదులాబాద్ క్రీడాకారులకు పథకాలు రావడం పట్ల హార్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు…
జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఆగస్టు 29: మేడ్చల్ ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీ యస్థాయి త్వైకాండో పోటీల్లో బంగారు, వెండి పథకాలు సాధించిన విద్యార్థులను గ్రామానికి చెందిన గాయరు విశ్వనాధం ఘన సన్మానం చేశారు. ఈనెల 27న బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఎదులాబాద్ గ్రామానికి చెందిన నలుగురు క్రీడాకారులు పాల్గొనగా. ఇద్దరు బంగారు, ఇద్దరు వెండి పథకాలు సాధించారు, కూతాడి ఆదిత్య, కంచుల మణికంఠలు గోల్డ్ మెడల్స్ సాధించగా. కందుల కార్తీక్, బొట్టు ఇషాంత్లు సిల్వర్ మెడల్స్ పొందారు. పథకాలతో పాటు నిర్వహకులు వీరికి ప్రశంసాపత్రాలను అందజేశారు. కేపీ హనుమంత్ తెలంగాణ త్వైకాండో యూనియన్ జనరల్ సెక్రటరీ. ఎదులాబాద్ మాస్టర్ గ్యార నాగరాజు. గ్యార నరేష్. మరియు మక్త అనంతరం రాపోలు గణేష్ మాస్టర్. వీరికి మంచి శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా కృషి చేశారు.
ఈ సందర్భంగా ఎదులాబాద్ లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామ ప్రజలు నలుగురికి అభినందనలు తెలియచేసి ఘనంగా సన్మానించి గ్రామంలో ఊరేగించారు . హనుమంత్ మాస్టర్ మాట్లాడుతూ కలకత్తాలో జరగబోయే అంతర్జాతీయ పోటీలో బాల బాలికలు పథకాలు సాధంచాలని విశ్వసం వ్యక్తం చేసారు. గాయారు విశ్వనాతం మాట్లాడుతూ రాబోయే అంతర్జాతీయ పోటీలకు నావంతు సాయ సహకారాలు అందిస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో గాయార్ విశ్వనాథ్ కే పి గ్రాండ్ మాస్టర్ హనుమంతు, మాస్టర్స్ నాగరాజు, నరేష్ , రాపోలు గణేష్. నాయకులు ఎంపిటిసి గట్టగల్ల రవి, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.