Janasena News Paper
తెలంగాణయాదాద్రి భువనగిరి

ముస్లిం కుటుంబ లకు నిత్యావసర సరుకుల పంపిణి

ముస్లిం కుటుంబ లకు నిత్యావసర సరుకుల పంపిణి చేసిన
భువనగిరి మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి.


యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10 :
భువనగిరి మండలం , బి ఎన్ తిమ్మాపురం గ్రామంలోని ముస్లిం కుటుంబాల అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా మన గ్రామ పెద్దలు భువనగిరి మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి వారందరికీ నిత్యవసర సరుకులు మరియు నూతన వస్త్రాలు అందజేసి, ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరులందరు పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. మరియు ఎంపిటిసి ఉడుత శారద ఆంజనేయులు బి ఆర్ ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు ఎండీ బాబా  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు ఎడ్ల సత్తి రెడ్డి వారి సొంత నిధులతో ముస్లిం కుటుంబాలకు వస్త్రాలు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దొంకేన ప్రభాకర్ గౌడ్   పాలసంగం మాజీ  చైర్మన్ జిన్న నర్సింహ, అన్నెపు వెంకటేష్ , జిన్న పాండు,
అన్నెపు శ్రీశైలం,నకిరేకంటి అశోక్ రావుల మహిపాల్ కుచ్చుల భిక్షపతి పిన్నం సత్తయ్య,    గ్రామస్థులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment