*అనంతలో అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం*
నాలుగున్నరేళ్లలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు
టీడీపీ హయాంలో నేతలు కొట్లాటకే పరిమితం.
ఐదేళ్ల పాలనా కాలంలో అనంతను భ్రష్టుపట్టించారు.
గతానికీ, ఇప్పటికీ తేడాను ప్రజలు గమనించాలి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదలకు సంక్షేమం.
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ.
కోవూరునగర్, హమాలీకాలనీల్లో ‘వై ఏపీ నీడ్స్ జగన్’
అనంతపురం జనసేన ప్రతినిధి డిసెంబర్ 1 :వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లుయ్యింది. ఇందులో రెండేళ్లు కోవిడ్‌తోనే గడిపిన పరిస్థితి. అయినా అతి తక్కువ కాలంలోనే అనంతపురం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాం. అనంతలో జరిగిన అభివృద్ధికి ప్రజలే సాక్ష్యం’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం నగరంలోని కోవూరునగర్, హమాలీకాలనీల్లో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించి బోర్డులతో పాటు వైసీపీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు విభేదాలు పెట్టుకుని వాళ్లలో వాళ్లే కొట్టాడుతూ అనంతపురంను భ్రష్టుపట్టించారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరూ సమిష్టిగా పని చేస్తూ అనంతపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
అనంతపురంలో జరిగిన అభివృద్ధికి ప్రజలే సాక్ష్యమని అన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద పథకాలు అందే పరిస్థితి ఉండేదని తెలిపారు. కానీ నేడు అర్హత ఉంటే చాలు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను కొనియాడారు. టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అయితేనే ఇంటింటికీ సంక్షేమ పాలన సాధ్యమవుతుందని చెప్పారు. అరాచక పాలన కావాలో, సంక్షేమ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామని, ఏ నాయకుడి ప్రమేయం లేకుండా కేవలం అర్హత మాత్రమే చూస్తున్నామని స్పష్టం చేశారు.
మరోసారి వైసీపీని ఆదరించాలని కోరారు. కార్యక్రమాల్లో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు వీరా రామకృష్ణారెడ్డి, చింతకుంట మధు, క్లస్టర్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, సైఫుల్లా బేగ్, బాబా ఫక్రుద్దీన్, రహంతుల్లా, వైసీపీ ఎస్సి విభాగం అధ్యక్షుడు సాకే కుళ్ళాయి స్వామి, సచివాలయ కన్వీనర్లు షేక్ ఖాజా, రఫీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, వైయస్సార్ సీపీ నేత మహానంద రెడ్డి, కార్పొరేటర్ మీనాక్షమ్మ, నగర పాలక సంస్థ సెక్రటరీ సంగం శ్రీనివాసులు, వైసీపీ నేతలు నాగార్జున రెడ్డి, అల్లి ఖాన్, వెంకటరెడ్డి, రామకృష్ణ, హనుమంత రెడ్డి, వలి తదితరులు పాల్గొన్నారు.,