Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మన్నెసుల్తాన్ పాలెంలో కార్డెన్ సెర్చ్

బెల్లంకొండ, జనవరి 23, జనసేన ప్రతినిధి

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని మన్నే సుల్తాన్ పాలెం లో సత్తెనపల్లి డి.ఎస్.పి ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘవ్యతిరేకశక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించిప్రజలకుమేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా… ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో మన్నే సుల్తాన్ పాలెం గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు – 28,పలుగులు – 07,గొడ్డళ్లు – 04,కత్తులు – 08, బరిసెలు – 02సర్వీస్ వైర్లు – 02వైరు చుట్టలు – 12
స్వాధీనం చేసుకోవడం జరిగింది ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ వాడకం గురించి డి.ఎస్.పి అవగాహన కల్పిస్తూ గ్రామంలోని ప్రజలచే తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.అంతేకాకుండా… రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డి.ఎస్.పి హనుమంతరావు తో పాటు పెదకూరపాడు సర్కిల్ సీఐ. పి సురేష్ ,అచ్చంపేట సి ఐ పి. శ్రీనివాస రావు ,బెల్లంకొండ ఎస్ ఐ పి. గోపి ,9 మంది ఎస్ ఐ లు మరియు 66 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

Leave a Comment