Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

అస్తమించిన జ్యోతుల


పదేళ్లు కాకినాడ మున్సిపల్ చైర్మన్ గా వెలుగొందిన జ్యోతులసీతారామ మూర్తి


కాకినాడ, జన సేన ప్రతినిధి, ఏప్రిల్ 7:
మధ్యతరగతి కుటుంబం నుండి అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చి మున్సిపల్ చైర్మన్ గా పదేళ్లు పనిచేసి వందేళ్ల గుర్తింపు తెచ్చుకున్న జ్యోతుల సీతారామ మూర్తి అంటే కాకినాడ నివాసులకు తెలియని విషయం కాదు. జ్యోతుల(90) 2024 ఏప్రిల్ 7 సాయంత్రం 5గంటలకు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమ పదించారు. జారిపడి పోయిన ఘటనలో గత పదిరోజులుగా చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నుండి ఆరోగ్యం క్షీణించి వైద్య సేవలు పొందుతున్నారు.

కాకినాడ మున్సిపాలిటీ లో పదేళ్ల పాటు 1982 నుండి 1992 వరకు మున్సిపల్ చైర్మన్ గా సేవలు చేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982 లో పరోక్ష పద్దతిలో 1987లో ప్రత్యక్ష పద్దతి లో ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఎస్ ఆర్ ఎం టి లో మేనేజర్ గా పని చేసిన జ్యోతుల కె వి ఆర్ చౌదరీ ప్రోద్బలం తో డమ్మీ అభ్యర్థిగా వార్డు కౌన్సిలర్ కి నామినేషన్ పత్రం వేయించడం .. యాదృచ్చికంగా స్క్రూటినీ లో అసలు అభ్యర్థి అప్లికేషన్ రద్దు కావడంతో జ్యోతుల అభ్యర్థి గా నిలవడం ఆ క్రమంలో కౌన్సిలర్ గా చైర్మన్ గా ఎన్నికవ్వడం రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని జ్యోతుల తన పదవీకాలంలో రాజకీయ అనుభవజ్ఞుల కంటే మిన్నగా పని చేసి అన్ని పార్టీల మన్ననలు స్వంతం చేసుకున్నారు.

జనరేషన్ మారడంతో నేటి రాజకీయాల్లో పూర్వ తరం నాయకులు సి వి కె రావు మల్లాడి స్వామి ఆ కోవలో జ్యోతుల సీతారామమూర్తి గురించి తెలిసిన వారు అరుదయ్యారు. జ్యోతుల హయాంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఆయనను గౌరవిస్తాయి. ఆయన హయాంలో పట్టణ త్రాగునీరు అవసరాలు తీర్చే బృహాత్తర ప్రణాళిక అమలయ్యింది. ఇప్పుడున్న మున్సిపల్ పాఠశాలలన్నీ ఆయన హయాంలో నిర్మించినవే. ఆయన పార్థీవ దేహం అపోలో ఆసుపత్రిలో వుంచారు. సోమవారం నాడు విజ్జపు రెడ్డి హిందు స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

Related posts

Leave a Comment