Janasena News Paper
Uncategorized

పండక్కి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. డీఏ సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్‌ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు.

ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.

Related posts

Leave a Comment