ముస్లిం కభరస్తాలో అభివృద్ధి పనులే జరిగాయి.. బోర్డ్ డైరెక్టర్ -పెద్ద దేవర మహబూబ్ పీరా
కనేకల్, జనసేన ప్రతినిధి ,మార్చి 23:
- కనేకల్ రామనగర్ నందు గల ముస్లిం కబరస్తాలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయని వక్ బోర్డు జిల్లా కమిటీ సభ్యుడు పెద్దదేవర మహబూబ్ పీరా అన్నారు.
ఆయన ముస్లిం నాయకులతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు పెద్ద దేవర మహబూబ్ పీరా మాట్లాడుతూ గతంలో కబరాస్తాలో ప్రహరీ గోడ లేక తెల్ల బండలతో ముళ్ళ పొదలుగా ఉండేది. దీని కారణంగా కబరాస్తాలో అసంఘిక కార్యక్రమాలు నడిచేవి గతంలో. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైపు కాపు రామచంద్రారెడ్డి ఎంపీ తలారి రంగయ్య దృష్టికి కబరస్తా సభ్యులైన మేము ప్రహరీ గోడ నిర్మించాలని కోరామన్నారు. దీనితో పాలకులు 20080 మీటర్ల ప్రహరీ గోడ నిర్మించడానికి 19.5 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతోనే కాంపౌండ్ నిర్మాణం గది నిర్మాణం చేసామన్నారు. కాంపౌండ్ ముందు భాగములో మిగిలిన స్థలములో మైనార్టీ నిరుపేదలకు జీవనోపాధికు బంకులకు పంచాయతీ కార్యాలయం అనుమతులు మంజూరు చేసి స్థానిక శాసనసభ్యులు అండగా నిలబడి జీవనోపాధి కల్పించారు అన్నారు. ఇంకా సగం కాంపౌండ్ నిర్మించాల్సి ఉంది అసెంబ్లీ పార్లమెంట్ సమావేశంలో ముగిసిన వెంటనే సగభాగం కాంపౌండ్ నిర్మాణమునకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇంతలోనే కొంతమంది ఆత్రుతతో జీవనోపాధిలో భాగంగా షెడ్డు నిర్మాణమునకు డ్రిప్పు వేశారు అంతేతప్ప దీని ఏ రకంగా గిట్టని వారు తప్పు దొవపట్టించారన్నారు. స్మశానములో అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయన్నారు కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా అవినీతి జరగ లేదన్నారు. మరియు ఒక సెంటు స్థలము కబ్జాకు గురి కాలేదన్నారు అనవసరంగా వైసీపీ పార్టీపై నిందలు వేసే ప్రయత్నం జరిగిందన్నారు స్మశానములో అభివృద్ధి జరిగిందా ఆక్రమణ జరిగిందా ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో కనేకల్ మేజర్ పంచాయతీ వైస్ సర్పంచ్ పెద్ద దేవర నభిషా. వార్డ్ మెంబర్ మహబూబ్. నబిషా. గౌస్. పెద్ద దేవర కలందర్ ఇమామ్ భాష. వైసీపీ మండల కన్వీనర్ ఆలూరి చిక్కన్న. టౌన్ కన్వీనర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.