Janasena News Paper
అంధ్రప్రదేశ్రాజకీయం

యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్

*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్*

జనసేన ప్రతినిధి మార్చ్:26

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు సాధించాలని నేపథ్యంలో చేపట్టిన యువగల్లం పాదయాత్రలో 51వ రోజు భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలోని పగడాలవారిపల్లెలో నిర్వహించిన బీసీ సదస్సులో ఓబుళదేవరచెరువు మండలం వేమారెడ్డి పల్లికి చెందిన వడ్డే పీట్ల సుధాకర్,వడ్డెర స్థితిగతులపై నారా లోకేష్ బాబుకు క్షుణ్ణంగా వివరించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 80% మంది వడ్డెరలు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారనిఈ సందర్భంగా తెలిపారు. అనాదిగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వడ్డెర కులం నేటికీ చర్చ సభల్లో ప్రాతినిధ్యం వహించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వడ్డెర జాతి హక్కులు సాధించుకోలేక దయనీయ స్థితిలో ఉన్నదని తెలిపారు. కొండ క్వారీలలో తమకు సముచిత ప్రాధాన్యత లేక ఆర్థికంగా చితికిపోయామని, నేడు యంత్రాలతో మా ప్రధాన జీవనాధారమైన కొండగుట్టలలో రాళ్లు కొట్టుకుని జీవించే వారికీ ఉపాధి లేక వలసలు వెళ్ళవలసి వస్తుందన్నారు.

ఎంతో మందికి జీవనాధారం లేక పస్తులు ఉన్న కాలం అనేకం అన్నారు. ప్రక్క రాష్ట్రాల్లో ఎస్. సి. లు గా, ఎస్. టి. లు గా ఉంటూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందారని, విద్యాపరంగా కూడా రిజర్వేషన్ సదుపాయంతో అనేకమంది విద్యావేత్తలుగా ఎదిగారని ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో అన్ని కులాల పై పట్టు సాధించాలనే సదుద్దేశంతో మీరు చేపట్టిన యువగళం పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా వడ్డీల స్థితిగతులపై తమరు ప్రత్యేక దృష్టి సారించి వడ్డర్లకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో వండర్ల అధికంగా ఉన్న పుట్టపర్తి కదిరి నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని వడ్డెర్ల కేటాయించి రానున్న రోజుల్లో వడ్డెర్ల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎదుగుదలకు చేయూత అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన నారా లోకేష్ బాబు మీ అభ్యర్థులను తప్పకుండా న్యాయం చేస్తానని 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా వడ్డెర జాతికి అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు కేటాయించి చట్టసభల్లో మీ వడ్డెర జాతి వారిని వినిపించేలా చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బీసీ సదస్సులో వడ్డెర జాతి వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్ కు శ్రీ సత్య సాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వడ్డే దళవాయి కుటుంబ సభ్యులు వడ్డే దళ వాయి వెంకటనారాయణ, వడ్డే సిమెంట్ పోలన్నలు మిఠాయిలు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండలం ఎర్ర వంక పల్లి వడ్డెర నాయకులు వల్లిపి గంగులప్ప, శ్రీరాములు, నారాయణప్ప,నల్లమాడ పల్లపు శ్రీరాములు, పల్లపు సాయి, పల్లపు ప్రసాద్ తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment