విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర టీడీపీ రైతు నేతలు
గన్నవరం, జనసేన ప్రతినిధి, అక్టోబర్ 1.
తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని విజయవాడకు విచ్చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమమిళ్ళ సూర్యం,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కళ్యాణి, బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు వేగిరెడ్డి పాపారావు తదితరులు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, వీరి తో తీసుకువచ్చిన రైతు కండువాను చంద్రబాబుకు వేసి మెమెంటుతో ఘనంగా సత్కరించారు.