సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి.
రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం
రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు మంజూరు చేయించిన మంత్రి అంబటి
సత్తెనపల్లి :
గత ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసిన తహసీల్దార్ కార్యాలయ భవనం రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు చొరవతో నిర్మాణం పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు మంత్రి అంబటి
రూ. 1.2 కోట్ల నిధులతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.17.5 లక్షల నిధులను అంబటి చొరవ తీసుకొని మంజూరు చేయించారు. త్వరలో ప్రహరీ గోడ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నాయకులను, అధికారులను మంత్రి ఆదేశించారు
కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, పట్టణ, రూరల్ మండలం వైఎస్ఆర్సిపి కన్వీనర్లు రాయపాటి పురుషోత్తమరావు, సహారా మౌలాలి, పక్కాలా సూరిబాబు, పల్నాడు జిల్లా వాణిజ్యభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, తహసీల్దార్ సురేష్ నాయక్, కమిషనర్ కొలిమి షమ్మి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు ఉన్నారు