Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించిన కంభం సీఐ…

కంభం, జనసేన ప్రతినిధి (ఫిబ్రవరి 8): ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శనివారం సీఐ మల్లికార్జునరావు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రోడ్డుకు అడ్డంగా పెట్టి వ్యాపారాలు చేస్తున్న వ్యాపార సముదాలకు సంబంధించిన సామాగ్రిని రోడ్డుపై నుంచి తొలగించారు. ఉద్దేశపూర్వకంగా రోడ్డుపై దుకాణదారులు తమ వస్తువులు పెడితే జరిమానా విధిస్తామని సీఐ మల్లికార్జునరావు వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంభం ఎస్ఐ నరసింహారావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

Leave a Comment