February 22, 2025
Janasena News Paper
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రకాశం

కురిచేడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎస్పీ…

దర్శి, జనసేన ప్రతినిధి (ఫిబ్రవరి 8): ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచన మేరకు ప్రకాశం జిల్లా దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ కురిచేడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ లో రోల్ కాల్ హాజరు అయ్యారు. హెల్మెట్ రక్షణ కవచం అని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి సిబ్బందికి వివరించారు. సిబ్బంది యొక్క కిట్‌లను పరిశీలించారు. నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనిస్టేషన్ అధికారులకు తెలియజేశారు. స్టేషన్ అధికారులకు దర్యాప్తులోని మెలుకువలను తెలిపి, దొంగతనం మరియు శారీరక నేరాలపై దృష్టిపెట్టి త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల్లో సాక్షాధారాలు, సాంకేతిక ఆధారాలు పక్కాగా సేకరించి కేసులు పరిష్కరించాలని, పోలీస్ స్టేషన్ నందు దస్త్రాలు పెండింగులో లేకుండా చూసుకోవాలని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు విజిబుల్ పోలీసింగ్ నందు పాల్గొనాలని, విజిబుల్ పోలీసింగ్ నందు, వాహనాల తనిఖీలు, రాత్రి గస్తీ విధులు నిర్వహించాలని, విధులు నిర్వర్తించేటప్పుడు ఒక చోట నిలబడి కాకుండా, తను ఉన్న ఏరియా మొత్తం పర్యవేక్షిస్తూ నేరాలు, రాంగ్ పార్కింగ్ లేకుండా చూసుకోవాలని తెలియజేశారు.

Related posts

Leave a Comment