నేడు పవన్ ప్రజల్లో….
పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదు…
జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుధా సాంబశివరావు……
జైల్లో తక్కువ బెయిల్ మీద బయట ఎక్కువ ఉండే 420, క్రిమినల్, సీబీఐ దత్తపుత్రుడు జగన్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించటం అంటే సూర్యూడిపై ఉమ్మి వేయడమేనని జనసేన పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు సుధా సాంబశివరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో సాంబశివరావు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై జగన్ “ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ” అంటూ మాట్లాడటం జగన్ అహంకారానికి పరాకాష్ట అని, అందుకే ప్రజలు ఆపార్టీకి 11 సీట్లు ఇచ్చి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని వెల్లడించారు.
ప్రజల్లో పవన్‌కళ్యాణ్ పరదాల్లో ఉన్న జగన్.

కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, డిప్యూటీ సీఎం గా ప్రజా రంజక పాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్‌పై జగన్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని సుధా సాంబశివరావు అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న జనసేనాని పవన్‌కళ్యాణ్‌ను విమర్శించే అర్హత జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. నాడు పరదాల్లో దాక్కొని జగన్ పరిపాలన కొనసాగిస్తే నిత్యం ప్రజల మధ్య ఉంటూ పవన్ కళ్యాణ్ నూతన చరిత్రను లిఖిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జగన్ పవన్‌ను అసెంబ్లీగేటు దాటనివ్వను అంటూ చెప్పించారని, ప్రస్తుతం జగన్‌నే అసెంబ్లీకి రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.ఇలాంటి అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారన్న ఇంగిత జ్ఞానం ఉండాలని హితవు పలికారు.కోర్టు అనుమతి లేకుండా పక్క దేశం కూడా పోలేని జగన్ ప్రజాదరణతో కొత్త చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు……