Janasena News Paper
అంధ్రప్రదేశ్పల్నాడు

పీఎం  కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 11వ తరగతి ప్రారంభోత్సవం మరియు ప్రతిభావంతుల సత్కారం

విద్యా ప్రగతిలో మరో కీలక మైలురాయి

ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు చేతుల మీదుగా పీఎం  కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 11వ తరగతి ప్రారంభోత్సవం మరియు ప్రతిభావంతుల సత్కారం

సత్తెనపల్లి:

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో సోమవారం 11వ తరగతి (ఇంటర్మీడియట్ ) తరగతి ను పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా యన్.సి.సి, స్కౌట్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

“ఒక చెట్టు – అమ్మ పేరుతో”

కార్యక్రమంలో భాగంగా ఎంపీ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11వ తరగతిని అధికారికంగా ప్రారంభించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ..
పాఠశాల పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆహ్లాదకరమైన ప్రాంగణం, విద్యా ప్రమాణాలు మరియు వినూత్న కార్యక్రమాలను అభినందించారు. విజ్ఞానం, క్రీడలు మరియు సహపాఠ్య కార్యక్రమాలలో విద్యాలయం సాధిస్తున్న విజయాలను కొనియాడారు. విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల అంకితభావాన్ని మరియు విద్యాలయ ఉపాధ్యాయుల సమిష్టి కృషిని ప్రశంసిస్తూ, ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను సత్కరించారు. సౌజన్య ఏఐ (కృత్రిమ మేధస్సు)లో 93 పిఐ సాధించినందుకు ప్రశంసాపత్రం అందజేశారు. సత్యం కు ఆంగ్లంలో 85 పిఐ సాధించినందుకు ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి శంకర్ ను కూడా ప్రశంసాపత్రంతో సత్కరించారు.

అండర్–17 వాలీబాల్ పోటీలలో విజేతలుగా నిలిచి రీజినల్ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు షీల్డ్‌లు మరియు పతకాలు అందజేశారు. 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా భారత ప్రభుత్వ ‘ఇన్స్పైర్–మనక్’ అవార్డు కింద ₹10,000 ప్రోత్సాహక నగదు అందుకున్న సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర పురస్కారానికి ఎంపికైన విద్యార్థులు మరియు వారి ఇన్‌చార్జ్ బజరంగ్ భీల్ ని కూడా ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
అదేవిధంగా, ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా ను సామాజిక సేవ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి మరియు విశిష్ట నాయకత్వానికి గుర్తింపుగా స్టూడెంట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కు , అతిథులకు, తల్లిదండ్రులకు మరియు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యాలయం భవిష్యత్తులో కూడా నాణ్యమైన విద్య, నవాచారం మరియు విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమం విద్యాలయ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోగా, 11వ తరగతి ప్రారంభంతో విద్యాలయం విద్యా ప్రగతిలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Related posts

Leave a Comment